STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

నీవు ఎప్పుడూ

నీవు ఎప్పుడూ

1 min
5

సొంతగొప్పలు మెప్పుకోసం వినిపించకూ నీవెప్పుడూ

భావమివ్వని ఉత్తకవితలు రచియించకూ నీవెప్పుడూ 


కసినిహృదిలో కుమ్మరించీ మసినిమదిలో రంగరించీ

మొసలిలాగా కంటనీటిని కురిపించకూ నీవెప్పుడూ 


ఎదనుమీటగ చేరపిలిచిన రాగసుధలను పంచమన్నా

నాదమివ్వని వీణతీగలు సవరించకూ నీవెప్పుడూ 


శిధిలబ్రతుకుల జీవితానా రుధిరజ్యోతి వెలుగులోన

పెదవిపైనే విషపునవ్వుతొ నటియించకూ నీవెప్పుడూ 


వింతలోకపు తీరుకల్లా అంతరాత్మయె నిజము

చింతలెన్నో ముసురుకున్నా విలపించకూ నీవెప్పుడూ


Rate this content
Log in

Similar telugu poem from Classics