STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవైపేచూస్తుంటే

నీవైపేచూస్తుంటే

1 min
2

నీవైపే చూస్తుంటే..కాలమసలు తెలియదేమి..!?


వేదించే ఆవేదన..తీరమసలు దొరకదేమి..!?


నువ్వైతే భలేబాగ..నవ్వుతూనె ఉంటావే..


ఈ ఊయల లోన నిదుర..గీతమసలు అందదేమి..!?


తోటలోని ఏ పూవును..కోయాలట నీ సేవకు..


నా మౌనపు కోవెలలో..దీపమసలు పలుకదేమి..!?


అక్షరాల వెన్నెలలో..విహరించే పనేమిటో..


నీ వెచ్చని చూపులలో..భావమసలు తోచదేమి..!?


మాయచేయు మాటలలో..ముంచెత్తే అల్లరేల..


అల్లుకున్న పరిమళాల..లోకమసలు నిలువదేమి..!?


ఈ మాధవ గజల్ గాక..మత్తుమందు ఎక్కడుంది..


తెలుగుకన్న మిన్నయైన..అమృతమసలు ఉన్నదేమి..!?


Rate this content
Log in

Similar telugu poem from Romance