నీతోనే ..!
నీతోనే ..!
సుఖం వేసవివేడిని తట్టుకునేలా
పైరగాలి వీచినపుడు ,
చలికాలంలో వెచ్చదనానికి రవికిరణాలు
తనువును మృదువుగా తాకినపుడు .
సుఖం అంటే ... ప్రేయసి కనులు
ప్రియుని పిలుపుకు స్పందించినపుడు ,
కౌగిలిలో ఒదిగి
తమకానికి గమకాలు కూర్చినపుడు .
మనలో యవ్వనం గువ్వలసవ్వడిలా ,
గుర్రాల పరుగులా .
పొంగే నదిలా , ఉప్పొంగే సంద్రంలా .
కమ్మని కలలా ,
ఓహ్ ... తియ్యతియ్యని ఊహలా .
నీవు నా గుండెలోని రవళి ,
నీ తలపు వేయిదివ్వెల దీపావళి .
నీ సొగసులు ఆరావళి ,
హొయలేమో చూడచక్కని నాగావళి .
నీవు గోముగా ' ఊ ' అంటే ,
నీపాటే పాడే వేణువునౌతా !
కాదంటే , ఎడారిలో ఇసుకరేణువునౌతా !!

