STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

నీరు

నీరు

1 min
1


సిగ్గుకెంత సిగ్గంటే..రెప్పలింత ఎత్తనీదు..! 

ముద్దుకెంత సిగ్గంటే..పెదవింటికి చేరనీదు..! 


గాయపడిన గాలిగుండె..గొంతునెలా విప్పగలదు.. 

తలపుకెంత సిగ్గంటే..నీ ధ్యాసను మరువనీదు..! 


శాపమునే వరమల్లే..మార్చుకోగ చూడాలోయ్.. 

మనసుకెంత సిగ్గంటే..బాధగదిని వదలనీదు..! 


మధుశాలకు దారివెతుకు..పనిమానుట ఎట్లాగో.. 

చూపుకెంత సిగ్గంటే..మరోమధువు ముట్టనీదు..! 


నాట్యమాడు మధుపాత్రయె..నవ్వేనా ఆగియాగి.. 

తనువుకెంత సిగ్గంటే..వలపుతలుపు పెట్టనీదు..! 


దట్టమైన అడవినడుమ..దాహమెలా తీరగలదు.. 

మబ్బుకెంత సిగ్గంటే..చినుకొక్కటి రాలనీదు..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics