నీలి కనులు
నీలి కనులు
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
నీలి కనులే చెప్పాయి మరో సంగతి అడగకనే
చాలినన్ని కబురులే చదవొచ్చే ఎటు చూడకనే
ఎక్కు పెట్టిన విల్లేలే ఎదలోకి గురిపెట్టే చూపులే
పెక్కు మారులు పెదవినుంచి కదలని వాక్కులే
చూసాకా ఆ వాలకం చూసేద్దాం వరించే మైకం
వేచాకా కలిగే ఆ వర్ణించ లేని వలపుల తమకం
కోరి చేరే కొత్త ఊసులు మత్తులోకి మరలించినే
దారికోరి ధరహాసమే ధన్యమై ఏదో తరలించినే
ఏరువాక సాగినటుల వెల్లువేనూ మోహమంత
ఎరవక సాగేను జైత్రయాత్ర తీరాక దాహమంత
నీలి కనులే చెప్పాయి మరో సంగతి అడగకనే
చాలినన్ని కబురులే చదవొచ్చే ఎటు చూడకనే
ఆకాశం హరివిల్లు అందివచ్చినట్లు కనిపించినే<
/p>
అవకాశం కోరే కూజితం అర్పణతో వినిపించినే
తీగలా అల్లినా అనుబంధం అమరమైనే ఆర్తిగా
జాజిలా జాగులేని ప్రేమతో కదిలేనూ స్పూర్తిగా
నీలి కనులే చెప్పాయి మరో సంగతి అడగకనే
చాలినన్ని కబురులే చదవొచ్చే ఎటు చూడకనే
ఎక్కు పెట్టిన విల్లేలే ఎదలోకి గురిపెట్టే చూపులే
పెక్కు మారులు పెదవినుంచి కదలని వాక్కులే
కనువిందు కలిగాకనే కాలయాపనలన్ని కట్టేసి
మునుముందు చూపించు ముచ్చటలు ఒట్టేసి
కనువిందు కలిగాకనే కాలయాపనలన్ని కట్టేసి
మునుముందు చూపించు ముచ్చటలు ఒట్టేసి
నీలి కనులే చెప్పాయి మరో సంగతి అడగకనే
చాలినన్ని కబురులే చదవొచ్చే ఎటు చూడకనే