STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

నీకు నీవే

నీకు నీవే

1 min
3


నీకునీవె ఓడిపోతె గెలుపేనని అనుకో

ఎవరోనిను గెలిపిస్తే ఓటమియని అనుకో


కత్తివేటు లెన్నితిన్న చివురించును మోడులు

చీకటినిను ముసురుకున్న వెలుగేనని అనుకో


పున్నమిరాతిరి సంద్రం దాటిపోదు తీరము

సభలోనిను పొగుడుతున్న చరుపేనని అనుకో


కొడిగట్టే ముందుదివ్వె వెలుగెంతో "చల్లా"

స్వర్గసుఖా లెన్నివున్న కలతేయని అనుకో


జన్మత: శతృవు నినుసాదరంగ రమ్మంటె

వేసినప్రతి అడుగాఖరి అడుగేనని అనుకో


Rate this content
Log in

Similar telugu poem from Classics