నీకోసం మళ్లీ నేనే పుట్టాలి
నీకోసం మళ్లీ నేనే పుట్టాలి
విరిసే ప్రతి కుసుమం నీకై పూయాలి
అవి నా సిగ చేరి నీ ప్రేమ సువాసనలు పంచాలి
పొద్దున్నే సూరీడే నువ్వై ఉదయించాలి
ప్రతి వేకువలో నీ తోడే నను నడిపించాలి
రేయంతా వెన్నెలగా నీ నవ్వులు కురవాలి
ఆ చల్లదనంలో నా కలలన్నీ నీతో నిండాలి
నువ్వు నాతో వుండే క్షణాలు నిలిచిపోవాలి
దూరమనే మాట ఎప్పటికీ దరి చేరకుండాలి
నా చివరి మజిలీ కూడా నువ్వే కావాలి
చేరిన ప్రతిసారి నీకోసం మళ్లీ నే పుట్టాలి....

