నీకోసమే వేయికనులు
నీకోసమే వేయికనులు
నీకోసమె వేయికనుల..చూస్తున్నది పూలపాన్పు..!
నీ తియ్యని కబురులెన్నొ..చెబుతున్నది పూలపాన్పు..!
కలవరమే లేనిచోటు..వరములైన కలలెన్నో..
చెప్పలేని యాతనలను..పడుతున్నది పూలపాన్పు..!
నిదురరాని రాత్రులతో..దోబూచుల గొడవేమిటొ..
చూపలేని నిప్పులెన్నొ..దాస్తున్నది పూలపాన్పు..!
మనసంతా నీ తలపుల..జాతరేగ అనుక్షణం..
ఈ గాజుల గలగలలను..వింటున్నది పూలపాన్పు..!
వసంతాల సంబరాలు..జ్ఞాపకాల తోటలోన..
చెలి పెదవికి మెఱుగులెన్నొ..పెడుతున్నది పూలపాన్పు..!

