నీకై నేను
నీకై నేను
తీరని కలలో కదలాడే కాంతిలా
తెలియని తపనలో తేలియాడే ఊహలా..
నీ స్వరం , నీ నయనం మరిపించాయి నన్ను పూర్తిగా
ప్రియతమా…!
ఎదురు చూసాను నీ మాటకై
నా యదను చుసాను నీ రూపుకై
ఎదురుగా ఉన్నా.. నా యదలో ఉన్నావని తెలుపలేకున్నా..
నా కళ్ళ ముందే ఉన్నా.. నా కలలో ఉంటున్నది నీవే అని అనలేకున్నా..
తెలిపే ధైర్యం ఉన్నా.. నీ స్నేహాన్ని మరచే ధైర్యం లేక , నీ ఉద్దేశం తెలియక
ఇలా శిల లాగే మిగిలిపోతున్నా.. నా హృదయాన్ని శిలని చేసుకున్నా..

