నీ వెనుకే ...
నీ వెనుకే ...
నన్ను కూడా నీతో నడవనీ నేస్తమా !
నీ వెనుకే పడుతున్నాయి నా అడుగులు .
ఈ నీ ఒంటరి పయనం ఎటువైపు ?
ముఖంలో ఏదో కలవరం కనిపిస్తోందే నాకు !
నిశీధిలోనూ ఆసరాగా ఉండేవాడే స్నేహితుడు .
ప్రేమ కలిగినా ఆశ్చర్యపడబోకు .
అదే కదా ఆనందతీరాలకు చేర్చేది , కోరితే !
నీ సమ్మతిలోనే సమాధానం దాగి ఉందిలే .
ఏమా కళ్ళలోని మెరుపు , నవ్వులోని తెలుపు !
సిగ్గుని అందంగా చూపుతున్నాయి చూడు !
ఏకమై సాగుదామా ! మమేకమై బ్రతుకుదామా !!

