STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ వేణువె తోడు

నీ వేణువె తోడు

1 min
110

నీ శ్వాసకు శ్వాసలాగ..మిగలాలని ఉంది..!

నీ తియ్యని చూపులలో..కరగాలని ఉంది..!


వేనవేల సెలయేఱులు..దూకుతున్న తీరు..

నీ నవ్వుల వీణియతో..ఆడాలని ఉంది..!


కోటిపూల తోటకదా..నువు నడచిన దారి..

కురుస్తున్న వెలుగుతేనె..పంచాలని ఉంది..!


లక్షణాలు గుణాలన్ని..రాలుతుంటె హాయి..

పరిమళించు మౌనంలా..పాడాలని ఉంది..!


ఈ తలపుల వీధులలో..మురిపాల ఊట..

అక్షరాల వెన్నెలగా..నిండాలని ఉంది..!


..నీ వేణువె..తోడు..చెలిమిగాన మాధురిగా..వెలగాలని ఉంది..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance