నీ తోడుగా
నీ తోడుగా
నీ తలపుల తోడుగా
కాదంటే కరగదు మన జ్ఞాపకం.
వద్దని వదలను మన ఏకాంతవాసం.
ఒంటరిగా ఒంటరినై నీ జ్ఞాపకాల
తోడుగా నీతోనే ఉండాలని ఉంటుంది.
ఈ కొంతసమయానికే ఒక్కసారిగా
కొన్ని వేల యుగాలుగా దూరం ఉన్నామనిపిస్తుంది.
శిలలాగ ఉన్న నాకు వినిపిస్తోంది నీ ప్రేమరాగం
పడుతున్న చిరుజల్లులో తడుస్తుంది
నా మనసు నీ తలపులో, పయనించే
నా హృదయ సాగరం ఒంటరిగా
నీ ఎదలోయల్లోకి, దాగి ఉన్నావు
నా మనసు కళ్ళలో నువ్వొక చెమ్మవై
నిన్ను తలవని క్షణం లేదని ఎలా చెప్పను
ప్రతి ఆలోచనలో నువ్వొక భావనై నాలో దాగి ఉన్నావని
నా ఏకాంత సాగరంలో ఒక సడిలా,
నీ ఆలోచనలో నన్ను నేను మరిచిపోతున్నా.
ఎందుకు ఇంతలా నా మనసుని వశం చేసుకున్నావని ఎలా అలా అడగను.
ఒంటరిగా ఉండే నేను ఇప్పుడు అనుక్షణం
నీ తలపుల తోడుతో ఉన్నా నీ అల్లరిలో అల్లరినై చూస్తూ ఉన్నా.
నీతో ఈ పయనం చాలా బావుంది మరి
ఒక తీయని జ్ఞాపకమై నన్ను తినేస్తుంది ఇది.
నీ వలపు కెరటాలు నను తాకుతున్నాయి.
భావాల అర్ధాలు నను వెతుకుతున్నాయి.
నేను మౌనంగా ఉండి ఆ నడి విందామంటే
నువ్వోక అలజడి అలవై నన్ను తడిపేశావు.
నీ ప్రేమ పరిమళంలో తడుస్తూనే ఉన్నా
పారిజాతాల పూలు నాకిష్టం అన్నానని
ఆ పూల పరిమళంలో చేరావా
నా మనసు వాకిట నిండా పారిజాతాల
పూల పరిమళం నిన్నే చూపిస్తుంది...
... సిరి ✍️❤️

