నీ తలపుల మేఘాలే
నీ తలపుల మేఘాలే
కలమెంతకు కదలకుంది..తెలియదాయె ఎందుకలా..!?
రెప్పలేమొ వాలవు కద..తోచదాయె ఎందుకలా..!?
నా ప్రేమకు అక్షరాల..రూపమివ్వ లేకున్నా..
అసలు మధుర భా'వనమే..అందదాయె ఎందుకలా..!?
కలహంసల రెక్కలపై..నీ చూపుల సంతకాలు..
సరసస్వర నిజవాహిని..చిక్కదాయె ఎందుకలా..!?
నీకోసం గజల్ నదిగ..మిగులుటయే భాగ్యము కద..
గుండెలయల సాక్షి నీవె..చూడవాయె ఎందుకలా..!?
చెలిమిగగన వీధులలో..సంచారిణి నైనానే..
ఈ తలపుల మేఘాలే..నిలువవాయె ఎందుకలా..!?

