నీ సొగసే..
నీ సొగసే..
నీ సొగసే చూసాకా మరి ఇక నిదురే రానంది
ఓ ముగిసే అధ్యాయం కాదులే వదిలి పోనంది
అవునన్నా కాదన్నా ఆమనే దిగివచ్చినట్లుంది
ఊ అన్నా ఉహు అన్నా ఆమెనే చెప్పినట్లుంది
నీ సొగసే చూసాకా మరి ఇక నిదురే రానంది
ఓ ముగిసే అధ్యాయం కాదులే వదిలి పోనంది
కలలా తారాడి కనులలో నిలిచి కలిసేపోనుంది
అలలా పోరాడి అలసి నా మదిలో తలపై ఉంది
లేత చిగురు సుకుమారమేను లేమ ఆంతర్యమే
పోతపోసిన బంగారమేను ఆ భామ సౌందర్యమే
వచ్చిపోయే వసంతం వదలకుండ విరబూసింది
వచ్చి రాని వలపు పంతం ఆ కల
నే తలపోసింది
నీ సొగసే చూసాకా మరి ఇక నిదురే రానంది
ఓ ముగిసే అధ్యాయం కాదులే వదిలి పోనంది
ఎగిరిపడే యవ్వనానిది ఎదిరించే సాహసమేగా
సాగిలిపడే సమ్మోహనంతో ఎదలోన హాసమేగా
ఎగిరిపడే యవ్వనానిది ఎదిరించే సాహసమేగా
సాగిలిపడే సమ్మోహనంతో ఎదలోన హాసమేగా
నీ సొగసే చూసాకా మరి ఇక నిదురే రానంది
ఓ ముగిసే అధ్యాయం కాదులే వదిలి పోనంది
అవునన్నా కాదన్నా ఆమనే దిగి వచ్చినట్లుంది
ఊ అన్నా ఉహు అన్నా ఆమెనే చెప్పినట్లుంది