నీ ప్రేమే లేదంటే
నీ ప్రేమే లేదంటే
నీ ప్రేమే లేదంటే..రూపమేది నా గజలుకు..!
నువు కలవకుండ ఉంటే..జీవమేది నా గజలుకు..!
డబ్బుతోటి కొనగలిగే దెంతసేపు నిలిచేనోయ్..
కన్నీళ్ళే లేకుంటే..గంధమేది నా గజలుకు..!
గుండెలయల పొదరింట్లో..కాపురమే హాయికదా..
నువు తాళం వేయకుండ..అందమేది నా గజలుకు..!
నిశ్శబ్దపు వనవాసం..విందుచేయు ఫలములెన్నొ..
నీ మౌనం తోడులేక..భావమేది నా గజలుకు..!
చెలిమిపూల చెట్టుమీది..కొమ్మలలో యుగళగీతి..
నీ నవ్వే లేకుండా..విషయమేది నా గజలుకు..!
విరహానికి వియోగాన్ని..కలిగించర మాధవుడా..
మనసు నీకు ఇవ్వకుండ..రాజ్యమేది నా గజలుకు..!

