నీ ప్రేమ సంద్రాన
నీ ప్రేమ సంద్రాన
నీ ప్రేమ సంద్రాన..పడవనై పోయాను..!
నీ చూపు వెన్నెల్ల..పాటనై పోయాను..!
రమ్మంటె వెనుదిరిగి..వచ్చేది ఎట్లనో..
నీ పలుకు తేనెకే..ఊటనై పోయాను..!
పేరేమి నీదంటె..పెదవికేమెరుకలే..
నీ గుండె లయమాటు..తీవనై పోయాను..!
ఒక బొమ్మ గీయగా..అందదే నీ రూపు..
నీ నవ్వు వెలుగింటి..నీడనై పోయాను..!
ఊరేగు గంధాలు..ఏ ఊరిలో నిలచు..
నీ కలల రాగాల..తోటనై పోయాను..!

