STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy

నీ ప్రేమ జ్ఞాపకాలు..

నీ ప్రేమ జ్ఞాపకాలు..

1 min
365


 నేను ఎ ఆశలు లేకుండా జీవిస్తున్న సమయాన నా జీవితం లోకి ఆశా కిరణం లా వచ్చావు.


ప్రేమ అంటే ఏంటో తెలియని నాకు ప్రేమ గొప్పతనం తెలిసేలా చేసావు.


ప్రేమించటం.. ప్రేమ ను అనుభూతి చెందటం మదికి పరిచయం చెసావు.


నేను బాధలో ఉంటే ఓదార్పునిచ్చావు.

నేను దుఃఖం లో ఉంటే కన్నీరు తుడిచావు.


ఇక జీవితం అంతా నీ తోడుగా..నీ ప్రేమలో..

ఆనందంగా గడిచిపోతుంది అనుకున్నాను.


కానీ అది శాశ్వతం కాదని,


నీ ప్రేమ ఒక జ్ఞాపకమే అని తెలిసేలా చేస్తున్నావు.


నీ ఎడబాటు విరహపు మంటల సెగలు నా తనువుని దహిస్తున్నాయి.


నిదుర రాక కనులు ఎర్రని జ్యోతులై వెలిగిపోతున్నాయి


హృదయం నిన్ను చేరాలని అత్యుత్సహం తో

అతిగా అలుపులేకుండా స్పందిస్తుంది


బావ నేను ఈ తనువు బాధ ను..

మనసు భారాన్ని మోయలేను..


ఇకనైనా నన్ను నీ ప్రేమ నుండి..

నీ విరహం బాధ నుండి విముక్తురాలిని చేయి.


నీ జీవితం లో నాకోసం కేవలం ఒక రోజు ను త్యాగం చేయలేవా.. ఎన్నో భావాలు మోస్తున్న కనులు..ఆనంతమైన ప్రేమను దాచుకున్న మనసు నీకోసం ఎదురు చూసి కరిగి కన్నీరై కనుమరుగయ్యేలా ఉంది..


వెళ్ళిపోతాను ఈ అనంతమైన విశ్వం లో..

నువు గుర్తు రాని చోటు ఉంటే వెళ్లిపోతాను..


అచ్చమైన అభిమానం కోసం, 

స్వచ్చమైన ప్రేమ కోసం వెతుకుతున్నాను 

విసిగి వేసారిపోయాను వెళ్ళిపోతాను .


చుక్కల లోకంలో ఐన ప్రేమ రసం దొరుకుతుందేమో "!

ఐన నా దగ్గరేముంది మనసు,మమత తప్ప !


శ్రీ...

హృదయ స్పందన.


Rate this content
Log in

Similar telugu poem from Romance