నీ పేరు వెతికాను
నీ పేరు వెతికాను
ఏ నిఘoటువుల్లో
నీపేరు వెతకనూ
నా మనస్సు చిత్రీకరించిన
నీరూపానికి ఓపేరు పచ్చబొట్టుగా
నా మనస్సులో చిత్రీకరించడానికి
నేను మాత్రమే పిలిచే కొత్తపేరు కావాలంటే
పండు వెన్నెలకు చెప్పివస్తాను
నీ కంటే తెల్లగా వున్నది తన మనసని
ఏ పేరు పెట్టనో చెప్పవా అని
మరుమల్లెను అడిగివస్తాను
తాను నవ్వితే నీకంటే స్వచ్చమే
మరి ఏపేరు పెట్టను అని
మలయమారుతాన్ని అడిగివస్తాను
నీ కంటే చల్లనిది తన మనసని
తానొక్కడు పక్కనుంటే ఇంకేమి
అవసరముండదని
లోకములో అన్నిటికంటే
అందమైనది తానే మరి
అందానికి మరో పేరు గ్లామర్ కదా
అందగాడు తన పేరు మరి

