ఓ నా మనసా♥️♥️
ఓ నా మనసా♥️♥️
వెన్నెల పువ్వల్లే నానవ్వును మార్చిన మామవు...
నా చంద..మామవు నీవేగా..
మాయ చేసిందెవరో ...ఎవరో..
మనసు మాయ చేసిందెవరో....ఎవరో
నీకు తెలియనిదా...
నిందలు నాపై వేస్తావేరా అల్లరి నవ్వుల రువ్వేస్తూ..
నేనన్నది ఇంకెక్కడ నాలో ఉందిరా అంతా నువ్వయ్యాక..
నా అందెల రవళి కి ఊపిరి నీవే
ఆ కళ్ళతోనే వేసేసావు విడదీయని బంధం
నాచేవిలో నీ గుసగుసలు విందేమో నాజుంకీ
ఆ ఊసుల గిలిగింతకు ఊగుతుంది నినుచూసి..
ఉక్కిరిబిక్కిరి అయ్యిందేమో
వెచ్చని నీ ఊపిరిస్పర్శ తో
నీవెదురుపడితే ఆగగలదా పిచ్చిమనసు??
అహ ఆగగలదా నను నీవైపుకు తరమకుండా??
తడబడినా అడుగులుమాత్రం నీదరికే
పొట్టి అన్న నీపిలుపే వేణు నాదమై
సూటిగా నిను చూడలేని సిగ్గు కమ్మేస్తుంటే..
దూరంగా పోలేను నువ్వట్టా చూస్తుంటే...
విరహాలన్నీ కరిగిపోతాయి ఒక్క నీపిలుపుకి
ఇంతసేపూ అలిగిన మనసు ...
వద్దన్నా వినకుండా ఏవేవో అంటుంది ..మరి
నిన్ను చూడగానే నామాట అస్సలు వినదే..
నన్ను దోషిని చేసి నీముందు నిలబెడుతుంది..
నాప్రాణం నా సర్వం నీవేరా
నేను నువ్వుగా మారిందెప్పుడో
నీనేనుగా మారిందెప్పుడో....
ఎన్నిజన్మ ల నుండి సాగుతోందో మన ఈ పయనం .
నాచేతిన గాజుల సవ్వడి నీవే
నానీలికురుల తురుమిన మల్లెల పరిమళం నీవే
నాకంటి కాటుక నీవే నీవే..
ఆకన్నుల తీయని కలలకు ఆధారమూ నీవే
తనువుని సిరిచందనమై హత్తుకున్నది నీవే..
గిల్లికజ్జాలు పెట్టుకున్నది ఎందుకో తెలుసా
అలకతీర్చు నీ మాటలు వినాలని
మరింతసేపు నిన్ను నాదగ్గర కట్టిపడేయాలని
నీవెళ్లి పోతానంటే గుండె ఆగినట్టై పోతుంది
బింకంగా ఉన్న మనసు పిచ్చిధై పోతుంది..
అందుకే ...అందుకే ...ఆగవు కన్నీళ్లు...
వదిలిపోకు ఎప్పుడూ ఈ మనసుని ఓ నామనసా..!!

