నీ నవ్వులు వలలో
నీ నవ్వులు వలలో
నీ నవ్వుల వలతో నను..కమ్మేయుట బాగున్నది..!
చూసి చూడనట్లు నీవు..వెళిపోవుట బాగున్నది..!
చెప్పాలనుకున్న మాట..పెదవిదాటి రాకున్నది..
గుండెగుడిని దేవతగా..నువు చేరుట బాగున్నది..!
కొండదూకు పాలనదిగ..మారినాను నీ దయతో..
నారెప్పల మాటున నువు..నిదురించుట బాగున్నది..!
నా కలవర పాటంతా..మార్చినావు ఒక పాటగ..
నీ పదముల ముద్రలలో..నడిపించుట బాగున్నది..!
గీసి దాచుకున్న బొమ్మలన్ని నీవె చిత్రముగా..
కంటికానకుండ నీవు దాగుండుట బాగున్నది..!
గులాబీలు చేమంతుల..గుసగుసలే వినపడెనా..
మన ఊసులు గాలిలోన..నింపేయుట బాగున్నది..!

