నీ నవ్వు లో పూలవాన
నీ నవ్వు లో పూలవాన
నీ నవ్వుల పూలనావ..ఇచ్చి పోయినావు కదా..!
విరహమనే కడలినడుమ..వదిలి వెళ్లినావు కదా..!
నీ నల్లని కురులనీడ..పొదరిల్లుగ భావింతును..
మదిలోయల పెనుచీకటి..నింపి మరలినావు కదా..!
ఈ వసంత హేల ఎంత..హేళన చేస్తున్నదోయి..
నా వాలని కన్నుదోయి..చేరి ఆగినావు కదా..!
చెలిమిపూల తోటలోన..గాలిలేని వాన నీవు..
ముఖ్యఅతిథి లాగ తొంగిచూసి జరిగినావు కదా.!
అసలు ప్రేమ గగనమంటె..నీ మనసే ఓ చెలియా..
వస్తావను చిన్ని ఆశ..నిలిపి ఉంచినావు కదా..!

