మనసున నీవే
మనసున నీవే
మనసున నీవే
మమతల వలపు నీవే
మాటల మంత్రంనీవే
హృది లయల ఆశవునీవే
మది తాకిపోయేజ్ఞాపకాల అలజడి నీవే
వెన్నెల నవ్వుల వెలుగులరేఖవు నీవే
వేయి రేకుల కలువల జాబిలి కళ వు నీవే
కమ్మని నిదురలోని నా కలల జాతర నీవే
విరిసిన విరుల మంజుల మధుర హాసం నీవే
వేల తారకల సందిటవెలుగురేడువు నీవే
ఎన్నినువ్వుల నువ్వైనా
నా స్వంతమైన నువ్వు
నా నువ్వువే నువ్వు నేను నువ్వే సుమా...!!

