అలుపు - గెలుపు
అలుపు - గెలుపు
మనిషిలో పిరికితనం...
ప్రయత్నంలో పలాయనం...
ప్రయత్నించకనే ఓడిపోయాననుకోవడం
మరణంతో సమానం!!
పిరికివాడి ప్రతిభ ఇసుకవంటిది
దోసిలిలో జారిపోతుంది!!
ప్రోత్సహించి వీరిని భుజానెత్తుకోవడమంటే
నడి ఎడారిలో ఇసుకమూటను మోసినట్లే!!
నీకు అలుపు తప్ప వీరిలో గెలుపు చూడలేవు

