STORYMIRROR

Midhun babu

Romance Classics

4  

Midhun babu

Romance Classics

నీ నీడయె

నీ నీడయె

1 min
192


నిలుపదగిన కవచంలా..దక్కెనోయి నీ నీడయె..! 
గ్రోలదగిన వెన్నెలగా..నిండెనోయి నీ నీడయె..! 

మావిగుబురులో దాగిన..కోకిలలా మనసైనది.. 
పాడదగిన పాటలోకి..ఒదిగెనోయి నీ నీడయె..! 

వింత ఏదొ జరుగుతోంది..ఊహకింత అందకుండ.. 
గీయదగిన బొమ్మవెనుక..దాగెనోయి నీ నీడయె..! 

ఈ మాటల జాతరలో..అక్షరాల చెలి ఎవరో.. 
వ్రాయదగిన గజల్ నిధిగ..మారెనోయి నీ నీడయె..! 

జాబిలితో జగడమాడు..జాణంటే ఇంకెవ్వరు.. 
చెక్కదగిన శిల్పం లా..చిక్కెనోయి నీ నీడయె..! 

రాజకీయ చైతన్యపు..వాహినిలో భాగమాయె.. 
విసరదగిన ఖడ్గంలా..దొరికెనోయి నీ నీడయె..! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance