STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

నీ ముద్దు

నీ ముద్దు

1 min
5


వేడుకోగ బ్రతికించే..ఓషధియే నీ ముద్దు..! 

దాచుకోగ ఉడికించే..జాబిలియే నీ ముద్దు..! 


ప్రతిరాత్రొక పూలపడవ..ప్రయాణమే జరిగేను.. 

అల్లుకొనుచు అలరించే..ఓ నదియే నీముద్దు..! 


వరదలయే ఒక వెన్నెల..వాన ఎలా ఉండునో.. 

మాటాడక మురిపించే..స్వరనిధియే నీముద్దు..! 


ఆగిపోయి కథనడిపే..ఆలోచన వెనుకేమి..

తెలుసుకోగ ఊరించే..భాషిణియే నీముద్దు..! 


మాటలెంత బాగుండును..కనులమాటు చేరితే.. 

ఈ మనసును లాలించే..నెచ్చెలియే నీముద్దే..! 


మౌనమైన నీ హృదిలో..ఇంతచోటు చాలందు.. 

గంధాలను వదిలించే..చమేలియే నీముద్దు.


Rate this content
Log in

Similar telugu poem from Romance