నీ మృదు మధురమైన
నీ మృదు మధురమైన
నీ మృదు మధురమైన అడుగుల సవ్వడిలో చరణకింకిణుల గలగలలు నా హృదయంలో ఏవో తెలియని అలజడి రేపాయి.. నీ నయన మనోహర రూపం కలకాలం ఇలాగే నా కనుపాపలలో నిలిచిపోయే అదృష్టం పొందనీవా.. మనసు పలికే సుస్వరాల సరాగాలలో తేలిపోతూ నీ అడుగులో అడుగునవ్వనా.. నీ అధరాల తీయని తేనియ పలుకుల చిరునామానవ్వనా.. నీ ప్రేమ కౌగిలి ప్రవాహంలో సాగిపోనా పూలతేరులా.. నీ ఊపిరిలో ఊపిరినై అణువణువులో కలిసిపోనా..!
