నీ మనసును
నీ మనసును
నీ మనసును నీవుగాక..వేదించే వారుండరు..!
లేనిపోని గాయాలను..మాన్పించే వారుండరు..!
ఉన్నచోట ఉండలేని..తనంతోటె గొడవంతా..
ఆగికాస్త చూడమంటు..బోధించే వారుండరు..!
దేవతలో దేవుళ్ళో..కల్పనలని ఏంచెప్పను..
అద్భుతమౌ వరాలేవొ..గుప్పించే వారుండరు..!
నీ ఆటన నీవుగాక..పాత్రధారు లింకెవ్వరు..
సూత్రధారి ఎవరంటే..చూపించే వారుండరు..!
కోయలేని వాడిపోని..మల్లెవనం నీ సొంతం..
చిరునవ్వుల సీమ'మదిని..వెలిగించే వారుండరు..!
బంధాలను ఆదరించు..గుణమెలాగ అబ్బేనట..
అ'మాయికత ఆనవాళ్లు..అందించే వారుండరు..!
