STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నీ మనస్సు

నీ మనస్సు

1 min
0


రుచులవీణ నీ మనస్సు..రాగాలను ఆలకించు..!

అనుబంధపు గడపచాటు..మోహాలను సంస్కరించు..!


పరితపించు తాపసీమ..కాల్చాలిక చెలిమిమీర..

ప్రేమకడలి అలలమీది..విరహాలను ఊరడించు..!


గగనాలకు అంచువెదకు..పనేముంది తెలిసికూడ.. 

పసిడివెలుగు పంచు తేనె..దారాలను పలకరించు..!


భావవనం ఉంది చూడు..అక్షరాల మౌనంలో..

పరిమళించు నిండుచెలిమి..గీతాలను ఆలపించు..! 


నరకమసలు ఎక్కడుంది..నాటకాన భాగమేగ.. 

కష్టాలా..! ఎదురయ్యే..భోగాలను సమ్మతించు..! 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance