STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ మనసే ప్రేమ లేఖ

నీ మనసే ప్రేమ లేఖ

1 min
200

నీ మనసే ప్రేమలేఖ..ఇవ్వలేక గొడవంతా..!

నీ చూపే పూలగొడుగు..నిలుపలేక గొడవంతా..!


నిదురపాలు సేవించక..హాయన్నది దక్కేనా..

నీకు నీవె తోడన్నది..తెలియలేక..గొడవంతా..!


ఇచ్చిపుచ్చు కునేదేమి..రెండు ఒక్కటైనప్పుడు..

అందమైన బంధమేదొ..చూడలేక గొడవంతా..!


పూలదండ చెలిమే కద..దారంలా నీవుంటే..

పరిమళించు చైతన్యం..పట్టలేక గొడవంతా..!


శుభలేఖలు ముడివేసిన..జీవితమే పేరంటం..

ఒకరికొకరు ఊయలగా..ఉండలేక గొడవంతా..!



Rate this content
Log in

Similar telugu poem from Romance