నీ మౌనం..
నీ మౌనం..
నిన్ను చూసినకాడే
విచ్చుకున్నాయి నా కన్నులకలువలు
నీతో ఊసు కలిపిననాడే
నిన్నల్లుకున్నాయి నా హృదయపులయలు
నా మనసు పరచిన గూడే
పరవశించాయి ఆ తనువులమెలికలు
నన్నొదిలి పోయిన నీ నీడే
వెక్కిరిస్తున్నాయి నీ జ్ఞాపకాలజాడలు...
నీ మీద కోపం వస్తే తప్ప
నీకు దూరంగా ఉండలేను
నీకు దూరం వుంటే తప్ప
నీతో మాటాడకుండా ఉండలేను
నీతో మాటాడకుండా వుంటే తప్ప
నే మౌనంగా మారలేను
మౌనంగా మారితే తప్ప
శిలనై శిధిలమైపోలేను...

