నీ మౌనమే
నీ మౌనమే
ఓయ్..........
నా హృదిగాయానికి..........
నీ అనునయమే లేపనం !!
కలత చెందిన మనసుకు..........
నీ పలకరింపే పరవశం !!
నా కనులనుండి జాలువారే అశ్రుబిందువులకు.........
నీ ఓదార్పే వెన్నెల చల్లదనం !!
నా అలకలు తీర్చే నీ సున్నిత మనసే...........
నాకు ఆలంబనం !!
నాకు కోపం వస్తే..........
నీ కనుపాపల లాలింపే కమనీయం !!
నీవు నేను తగవులాడిన వేళ.............
నీ మౌనమే సమాధానమై.............
నను మరీ మరీ ఊరడించి...........
నా మనసంతా ప్రేమమయం చేసే............
నీ అమృతతుల్యమైన హృదయానికి.............
నా నమస్సుమాంజలి !!!

