STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ కాంక్ష

నీ కాంక్ష

1 min
345

అలతి అలతి పదాలన్నీ ఆరాటపడుతుంటాయి

నిన్ను మిన్నగా అభిషేకించి సరికొత్తగా అల్లుకోవాలని


కాలాన్ని కసురుతుంటాయి నాకనులు దూరాన్ని దగ్గర పరిచే గడియను నాకందకుండా దాచావని


శిలను అందమైన ఎన్నో శిల్పాలుగా చెక్కగలం  బొమ్మలుగా చిత్రించగలం కానీ హృదయంలో ఒక రూపాన్నే మాత్రమే  బందించగలం


బొమ్మలేన్నిటికో తావుంటే అది హృదయమే కాదు

గుర్తులన్నీ మాసి పోతే మనసే లేదు


 రాయిగా మార్చి నీవొదిలిన సుతిమెత్తని పువ్వుగా మిగిలి నీ పాదలను కందకుండా చూడటమే నాకు తెలుసు


 ఉన్నతిగా జీవించడమే తెలుసు ఆంక్షలు లేవు బాగోగులు కోరే కాంక్షలు తప్ప


Rate this content
Log in

Similar telugu poem from Romance