నీ జ్ఞాపకాలు...
నీ జ్ఞాపకాలు...
కలబడుతున్న కన్నీటిలో
నిలబడుతున్న నీ జ్ఞాపకాలు
మౌనాల కానలలో
పూజిస్తున్నా రేపవలు నీదైన ధ్యాసలు
శ్వాసకెంత అలకో
తనను మొత్తం నీ తలపులతో నింపేసానని
గుండెకెంత కినుకో
నీపేరునే తన చప్పుడుగా మార్చేసానని
ప్రాణానికెంత జాలో
నేనంటూ లేనేలేనని నీలా మిగిలున్నానని...

