STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

నీ చూపుల భాషలు

నీ చూపుల భాషలు

1 min
8


నీ చూపుల భాష చదువు..చదువేదో నేర్పవా..! 

నా మదినే నినుచేరే..ప్రేమనదిగ మార్చవా..! 


మధువుతాగు వేడుకయే..వరమిచ్చిన నెచ్చెలీ.. 

వేడుకొందు లోనివెలుగు..తీగసాక్షి నిలుపవా..! 


కాలమాగి పోయేలా..చేసినావు చిత్రమే.. 

ఈ మసీదు మందిరాల..గొడవలింక తీర్చవా..! 


స్నేహానికి అసలర్థం..తెలియజెప్ప లేనులే.. 

ప్రాణదీప పూలవీణ..తంత్రులలో చూడవా..! 


మాటలెంత గమ్మత్తుల..మత్తులోన ముంచునో.. 

గుండెచాటు మౌనసాక్షి..జాడ కాస్త పట్టవా..! 


గోపురాన వాలి ఎగురు..గువ్వలాంటి మనసేది.. 

ఏ జండా ప్రేమవిలువ..తెలుపగలదొ చెప్పవా..! 




Rate this content
Log in

Similar telugu poem from Romance