STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ చూపుల భాషలు

నీ చూపుల భాషలు

1 min
2

నీ చూపుల భాష అసలు..చదవలేను నేస్తమా..! 

గుండెచాటు కడలిఘోష..చూపలేను నేస్తమా..! 


సవాలేదొ ఉందంటే..నవ్వుతుంది నా మనసు..

సమాధితో అనుబంధము..వదలలేను నేస్తమా..! 


ప్రవహించే నదిలాగా..జీవిస్తూ ఉన్నాను.. 

పగిలిన పడవగ బ్రతుకును..చూడలేను నేస్తమా..! 


అనురాగపు సౌధమంటె..నీనీడని తెలిసింది..

నీ ఒడిలో గాక తలను..వాల్చలేను నేస్తమా..! 


కలనైనా నినుచూచే..భాగ్యమేమొ కరువాయె..

నిదురరాని రాత్రులతో..పోరలేను నేస్తమా..! 


పగలుకూడా తెలవారని..రేయిలాగే ఉన్నది..

ఎదురుచూపు పాటగొడవ..తెలుపలేను నేస్తమా..


Rate this content
Log in

Similar telugu poem from Romance