STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

నీ చిరు గజ్జెల సవ్వడి

నీ చిరు గజ్జెల సవ్వడి

1 min
5


అక్షర యుద్ధం చేస్తున్నా 

బతిమాలో బుజ్జగించో 

ఆలిగో కోప్పడో ఆర్ధించో 

ఎన్ని ప్రయత్నాలు చేసినా 

పదాలు భావాల బీరువా ఎక్కి 

వెక్కిరిస్తూ ఏడిపిస్తున్నాయి

మేము రాము పొమ్మంటూ 

చిలిపిగా నన్ను వెక్కిరిస్తున్నాయి

 

ఇంతలో నీ కాలి అందియల 

చిరు గజ్జెల చప్పుడు నా 

చెవుల్లో సాహిత్య నాదస్వరాలు 

శ్రావ్యంగా గుండె వీణ తీగలు  

మీటి సరిగమలు మ్రోగించి 

పదముల నాట్య పొందికలు 

కావ్య రూపాలు సంతరించి 

నాలోని ఉద్రేక ఊహల్ని 

ఒక్కసారిగా ఉత్తేజపరిచి 

భళ్ళున నామీదకు ఉరికాయి 


అక్షర భావాలన్నీ ఒక్కసారిగా 

ఉబికి ఉబికి నర నరాలను 

చలింపచేసి కవన తాండవ 

నృత్య సాహిత్య సునామీని 

సృష్టించి కవితా ధారలను 

నా అణువణువు విజృంభించి 

జ్వలింపచేసి నన్ను తరింపజేశాయి 


ఔరా ! ఇంత మహోత్తర 

శక్తి నీ పాద అందియలకు 

ఇంతటి మహిమా శక్తి ఉందని 

నేనెరుగ చెలి ! ఇక నీ అంగాంగ 

అలంకరణ సడి సోకితే ఒక 

అక్షర ముత్యాల కవనాల సాహిత్య 

సుందరకాండనే సృష్టిస్తానేమో, 

సాష్టాంగమై నీకే సమర్పిస్తానేమో !



Rate this content
Log in

Similar telugu poem from Romance