నీ చెలిమి
నీ చెలిమి
మనసుతో ఆటాడు..గాలియే నీవందు..!
హృదినేలు నీచెలిమి..ధారయే తోడందు..!
కూటస్థ చైతన్య..దీపమది ఇంకేది..
ఓంకార నాదంపు..వాహినికి ఇల్లందు..!
వినిపించు నీ గాన..మాధురీ ప్రభకేమి..
మాటలకు అందకే..ప్రవహించు ధనమందు..!
మోయగా గొప్పలకు..లోటేమి లేదులే..
విందనగ ఊరించు..నీ తలపె ఘనమందు..!
వెంటబడు కోర్కెలను..గమనించ తెలిసేను..
నిజశ్వాస ధ్యాసతో..దగ్దమే చూడందు..!
ఏడుచక్రములందు..ఏతీరు తిరుగాడు..
వలపింత నిలిపితే..కర్మలే చెల్లందు..!
