నీ బంధనల ఊయలలో
నీ బంధనల ఊయలలో
నిబద్ధతకు నిర్వచనం..ఇవ్వాలని లేదు..!
నిబంధనల ఊయలలో..ఉండాలని లేదు..!
నీవు-నేను ఒక్కటనే..సంగతెంత వింత..
ప్రేమవిలువకో పాటను..కట్టాలని లేదు..!
నవ్వకలా సెలయేఱై..దూకుతున్న తీరు..
ప్రాణమెగిరి పోగలదని..చెప్పాలని లేదు..!
కనిపించక ఊరిస్తూ..కవ్వింతువు ఏల..
నిన్నుగాక అక్షరాల..పొగడాలని లేదు..!
కలనుకూడ కననీయవు..కరుణించవు కదా..
నా మనసును లేఖలోన..పొదగాలని లేదు..!
దారిలేని అడవిలోన..వదిలివెళ్ళి నావు..
నీ చెలిమిని గాక ఏమి..అడగాలని లేదు..!
నా అడుగుల జాడసాక్షి..మాధవా నీవే..
నీ రచనను అనువాదం..చేయాలని లేదు..!

