STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

నిధి నిక్షేపాలు

నిధి నిక్షేపాలు

1 min
2

నిధి నిక్షేపాలు.
 (వచన కవిత)
**************************
ప్రకృతిని రక్షించు సంప్రదాయ మెల్లెడ సాగుచుండ.
సకల సంపదలు పొంది జనులు శాంతితో మెలగుచుండ.

కనుమ పండుగ నాడు కర్షకులు పశుతతిని పూజింపగా.
ఘనముగా కొష్ఠముల నలంకరించి తమ శ్రద్ధను చాటగా.

గంగిరెద్దుల మేళములతో వీథులు కళకళలాడుచుండగా.
ముంగిళ్ళల్లో రథపు ముగ్గులు కనువిందు చేయుచుండగా.

కోడి పందాలతో నెడ్ల పండాలతో నుత్సాహము నిండిపోవగా.
వాడవాడల చెలువొందు వైభవము సీమకు గర్వ కారణముగా.

పల్లెటూళ్ల కెనలేని ప్రాభవమును తెచ్చిపెట్టు నీ పండుగలు.
ఎల్లలు లేనట్టి యానందాన్ని పంచుతూ పొంగించు సిరులు.

మూడు దినముల పెద్ద పండుగ ముగింపుకాలమని దిగులు.
వేడుకలను తల్చుకొంటూ మరలు చున్నట్టి బంధుమిత్రులు.

ఆరోగ్య దాయకములైనవీ సంప్రదాయపు పర్వదినములు.
పరోపకారముతో మసలి, ప్రకృతిని పూజింప కల్గు శ్రేయములు.

చైతన్యప్రకాశములై జ్ఞానము నందించ వచ్చెడి భాగ్యదాయికులు.
జాతిని సన్మార్గంలో నడిపించి జవము నొసగు ఋతుచక్రములు.

పర్వ దినములు జరుపుటలో దాగిన విజ్ఞాన రహస్య నిధి నిక్షేపాలు.
సర్వ లోకముల కాచరణ యోగ్యమైనట్టివీ యారోగ్య సూత్రములు.

మన పూర్వ ఋషుల తపః ఫలితముగా మన కందిన సంపదలు.
కనుగొని యాచరించిన భావితరములకు పొలయు శుభములు.//
***********************


Rate this content
Log in

Similar telugu poem from Classics