STORYMIRROR

# Suryakiran #

Drama

4  

# Suryakiran #

Drama

నగరం నిద్రపోతున్న వేళ !

నగరం నిద్రపోతున్న వేళ !

1 min
312

జీవితం ఎప్పుడెలా ఉంటుందో ! 

                     కానీ , లోకంలో జనులందరు   

తగిన భద్రతతో సాగితే   

                నిశ్చయంగా ఆనంద డోలికల్లో ! 

పగలు పనిపాటలకు సమయం . 

                     రాత్రిళ్ళు హాయిగా విశ్రాంతి   

తీసుకోవడం మనకు అవసరం . 

                  అప్పుడే అందమైన జీవనం ! 

ఐనా , నగరం నిద్రపోతున్న వేళ   

              కొందరు వారి విధినిర్వహణలో ,   

మరికొందరు లక్ష్యసాధనలో   

             మునిగి వ్యక్తిగత వ్యవహారాల్లో ! 

ప్రేయసిప్రియులు తమ ఇళ్ళలో   

                        ఒకరి గురించి మరొకరు   

అందమైన కలలు కనుచూ   

              అవి నిజం కావాలని కోరుతూ ! 

వినోదకార్యక్రమాల నిర్వాహకులు

              సరాగాలతో , వెలుగురేఖలతో

నిషాలో తమాషాను చూసేవారు

                 గమ్యమెరుగని అడుగులతో !

అసామాజిక శక్తులు   

                 చీకటి అలముకున్న వీధుల్లో ,   

సంచరిస్తూ అజ్ఞాన తిమిరాల్లో   

                   ఆర్జిస్తూ అక్రమ మార్గాల్లో ! 

ఒంటిస్థంభపు వీధిదీపాలు   

                   ధ్యానముద్రలో కనిపిస్తూ ,   

రద్దీగా ఉండే రహదారులు   

                 కలతనిద్రలో దర్శనమిస్తూ ! 

రక్షణదళాలు మంచిని కోరుతూ  

         ఆశలకాంతులను వెదజల్లుతూ .

రోజురోజుకు నూతనోత్సాహాలతో

               ప్రపంచం ఆవిష్కృతమౌతూ !!



Rate this content
Log in

Similar telugu poem from Drama