నగరానికి జబ్బు చేసింది
నగరానికి జబ్బు చేసింది
నగరానికి జబ్బు చేసింది.
కాలుష్యం కోరల్లో చిక్కుకున్న
నగరానికి జబ్బు చేసింది.
చెట్లన్నీ కొట్టేస్తుంటే చూసిన
భూ మాతకు దిగులు వేసింది.
వాహనాలు వదిలిన పొగను
పీల్చి వాయుదేవుడే భయపడ్డాడు.
కన్న తల్లిఒడి లాంటి ప్రకృతి
నేడు బాధతో కుమిలిపోతోంది.
ఇప్పటికైనా మేలుకో నేస్తం.
మొక్కలను పెంచుకో.
కాలుష్యం తగ్గించుకో.
బాధ్యతగా మసలుకో.
పర్యావరణాన్ని కాపాడుకో.
పర్యావరణాన్ని కాపాడుకుంటే
నిన్ను నువ్వు కాపాడుకున్నట్లే.
