మాతృ దీవెన పొందాలి.
ప్రతి ఒక్కరికీ వారి తల్లి
ఆశీస్సులు ఉండాలి.
కన్న తల్లికి కంటనీరు తెప్పించిన
వారిని భగవంతుడు క్షమించడు.
తల్లిని క్షోభ పెట్టడానికి మించిన
పాపం ఈ భూమ్మీద లేదు.
నవమాసాలు మోసి,పెంచిన తల్లి
పట్ల ప్రేమ, గౌరవం చూపించాలి .
అప్పుడే తల్లి సంతోషపడుతుంది.
అమ్మ సంతోష పడితే
దేవుడు ఆశీర్వదిస్తాడు.
మాతృదేవోభవ అనేదిఅక్షర సత్యం.
అమ్మ మనసులో దేవుడు ఉంటాడు.