Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

నేటి పౌరుడా!

నేటి పౌరుడా!

1 min
298


నేటి పౌరుడా!

(కవిత )


కఱకు గుండెల దొరల నెదిరించి

తెరలి తెరలి ప్రాణాలకు తెగించి

తరగని స్వేచ్ఛాసంపదలు నీకిచ్చి

కురిపించిరి ప్రేమ నీపై నేటి పౌరుడా!

మరల మరల స్మరించుము భారతీయుడా!


చెరసాలలందున మగ్గిమగ్గి మసిబారి

తెఱవన్నది లేక కోరుకొంచునా యురి

చిరునగవుతో నా స్వర్గానికి చేరి చేరి

సిరులెన్నియో నీకు మిగిల్చిరి నేటి పౌరుడా!

మరల మరల స్మరించుము భారతీయుడా!


వారి నెత్తురు నీ దేహంలో జీవధారగా

మారిపోయెను నీ గుండెలో శ్వాస నింపగా

వారి చితాభస్మముపై నీ భవిత నిల్వగా

తీరుచున్నవి నీదు కోర్కెలు నేటి పౌరుడా!

మరల మరల స్మరించుము భారతీయుడా


శూరులై తెగగొట్టిరి దాస్య శృంఖలాలు 

భారత స్వాతంత్ర్య సమర యోధులు

చరితను వెలిగించిరీ ఘన త్యాగధనులు

మరిచిపోకోయి వారిని నేటిపౌరుడా!

మరలమరల స్మరించుము భారతీయుడా!//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational