STORYMIRROR

Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

నేస్తమా

నేస్తమా

1 min
442

నేస్తమా

అని పిలువగలనా ఇక ఎప్పటికయినా

సముద్రమంత దూరం మన మధ్యన

అది కరిగేనా


పొరపాట్ల వల్ల కలిగిన ఈ ఎడబాటు తొలగి

కాలం నన్ను నిన్ను కలిపేనా


ఇక ఎప్పటికీ నీకు కనిపించనంత దూరం వెళ్ళిపోతున్నా

అయినా

ఒక్క పలకరింపుకు కూడా నాకు అర్హత లేదా

ఒక్క చల్లని ఆత్మీయ స్పర్శ కూడా నేను పొందకూడదా


అంతేనా

జీవితమంటే ఇంతేనా

విధి ఆడే ఈ వింత ఆటలో

అన్నీ తెలిసినా మనం ఇలా విడిపోవాల్సిందేనా


నే నీ కోసం వంద అడుగులు వేశాను

నా కోసం ఒక్క అడుగు వేయలేవా

నా వైపు నడవలేవా

ఒక్కసారి ప్రేమతో పలకరించలేవా

స్నేహాన్ని గెలిపించలేవా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama