నేనూ
నేనూ
రాతిరంతా రమ్యమైనా రాగతాళం వింటి నేనూ
కోయిలొచ్చీ కూసె కాదా వీతరాగం వింటి నేనూ
వెన్నెలైనా వీడలేదే మంట రేపే వేదనాయే...
తోటలోనీ పూలబాసే సౌమనస్యం వింటినేనూ..
చింత తీర్చే. త్రోవలన్నీ బంధమేసే మాయలేగా
వెంటనుండే ధైర్యశ్వాసా వేద మంత్రం వింటి నేనూ..
కొప్పులోనీ మల్లెదండా ఫక్కుమంటే కోపమేగా.
కంట నీరే పొంగుకొస్తే , మౌన గీతం వింటి నేను
విశ్వవీణే మూగబోతే తంత్రులన్నీ దండగేగా
మార్చలేకా, మార్పురాకా సాంధ్య రాగం వింటి నేను..
