నేను
నేను
స్వర్గానికి మెట్లుకట్టి..చూపలేను నేను..!
నీ హృదయపు ద్వారమేదొ..తెఱవలేను నేను..!
ప్రేమిస్తూ ఉంటానని..చెప్పుటెంత తప్పు..
ప్రేమ అనే మధువుతప్ప..త్రాగలేను నేను..!
నిదానమే ప్రధానమని..తెలిసిందా అసలు..
ఆలస్యం విషమౌనని..చెప్పలేను నేను..!
విరహమెంత సుఖమంటే..చెలిమనసుకు తెలుసు..
ఎఱుకవిలువ మాటలలో..పెట్టలేను నేను..!
అధికారం చలాయించు..ముచ్చటలో మనసు..
అహంకారమే నేస్తం..విడువలేను నేను..!
చిరునవ్వుల ముసుగేసుకు..నాటకమా బ్రతుకు..
అంతరంగ దీపముతో..ఉండలేను నేను..!
