నేను
నేను
ప్రేమకోసమే మనసాంటే..విశ్వప్రేమ బిందువును నేను..!
దు:ఖసంద్రమే మనసాంటే..జారని కన్నీటి బొట్టును నేను..!
ఒక గాయమే మనసాంటే..గాయాల ఆలయమును నేను..!
వెర్రితనం మనసాంటే..చెలిపెదవుల సుమహాసము నేను..!
తెలుగులో మనసాంటే..మౌనగగనమును నేను..!
బహార్లలోనే మనసాంటే..పరిమళించే బహారును నేను..!
అతిశయమే మనసాంటే..మేఘ సమూహమును నేను..!
సమాధియే మనసాంటే..దానిపైని చిరు'కఫను'ను నేను..!
విరహాగ్నిధార మనసాంటే..తీరని ఎదురుచూపును నేను..!
వియోగవేదనే మనసాంటే..ఒక హృదయశకలమును నేను..!

