నేనొక ఒంటరి
నేనొక ఒంటరి
నేనొక ఒంటరి పోరాటాన్ని
నేనొక అసహాయు రాలిని
నేను ఆధైర్యం గుండెల్లో నింపుకుని
పైకి సింహపు గర్జన చేస్తూ బ్రతికే నిస్సహాయురాలిని
స్వేచ్ఛ కోసం జీవితం అంతా
పోరాటం చేస్తూ ఓడిపోతున్న రాచిలుకని
పంజరం నుండే లోకాన్ని చూస్తున్న అల్ప సంతోషిని
నన్ను ఆడించడానికి చూసే వారి నుండి పారిపోలేక
పంజరం నుండి బయటపడలేక పోరాడి ఓడిపోతున్న
నిర్బాగ్యురాలిని
ముఖ్యంగా నేనొకా ఆడదాన్ని
అనాదినుండి నాన్నచాటు
భర్తచాటు కొడుకుల చాటు
బ్రతుకుతున్న ఒంటరి కడలిని
నా ఘోష నాది తప్ప ఎవరికీ చెప్పుకోలేని నిరాశ్రీ్యురాలిని
నేనంటే ఏమనుకుంటున్నావు
నలిగిపోతున్న జీవితాన్ని
వెలకట్టలేని పుస్తకంలో
కన్నీళ్లకు బదులు రక్తంతో
సిరా నింపి రాస్తున్న
ప్రతీ పేజీ రక్త చరిత్రనే
పోరాడి గెలవాలి అనే ప్రయత్నం
ఓడిపోతున్న నిలవాలి అనే ప్రయత్నం
ఇప్పుడేదో కావాలి
నాఉనికి మిగలాలి
దాహం తీరే మార్గం వెతకాలి
నా పేరు గట్టిగా వినబడాలి
చరిత్రలో కొన్ని పేజీల్లో నాపేరు కనపడాలి
నాలోపలి భయానికి సంకెళ్లు వేయాలి
నటిస్తూ గంభీరమ్ ప్రదర్శించడం కాదు
ధైర్యంగా తెగువ చూపాలి
ఎక్కడికెళ్లిన నీవు ఆడదానివి అని ఎవరికి వారు నెట్టేస్తువుంటే నిజంగా ఇక్కడదాన్ని కాదా అనే ఆలోచన నుండి బయటపడి నేనొక నిప్పుకణం
అని చాటాలి ఎక్కడయినా బ్రతికేస్తా ఆడ అయినా ఈడ అయినా అని చాటి చూపిస్తాను
