నేనెవరిని
నేనెవరిని
నా సుఖం నాదే,
నా దుఃఖం నాదే,
నా సంతోషం నాదే,
నా విచారం నాదే,
నా మాట నాదే,
నా మనసు నాదే,
నా మాయ నాదే,
నా మర్మం నాదే,
నా దేహం నాదే,
నా ధ్యానం నాదే,
నా ప్రపంచం నాదే,
నా ప్రపంచ సృష్టి నాదే,
మీరెవరో అనుమతితో,
ఏదోగతితో మీ ప్రపంచం
దాటి నా ప్రపంచంలో వచ్చిన
పర్యాటకులు,పరిస్థితులు.
ఆపై బంధాలు,బాధ్యతలు.
మీతో స్మృతులన్ని నావే,
విస్మృతులన్ని నావే...
ఆపై మరణం నాదే
నేనే లేను,నా ప్రపంచమూ లేదు,
ఇక మీరు ఎలా రాగలరు.
అవును అసలు నిజమైన
నేనెవరిని...సమాధిని,
నిశ్శబ్దాన్ని,నిరాకారాన్ని.
జననం నుంచి మరణం వరకు
సృష్టి నుండి సమాధికి,
శబ్దం నుండి నిశ్శబ్దానికి,
ఆకారం నుండి నిరాకారానికి
ప్రయాణమే జీవితం.
అందరికి సమాధి స్థితి సమానం,
అదే అందరికీ ఏకం,
మనం సృష్టించుకున్నా
నీ,నా ప్రపంచాలనేకం,
అందుకే నీ జీవితం,నా జీవితం.

