నేనేమి చేశాను నేరం
నేనేమి చేశాను నేరం
నేనేమి చేసాను నేరం
ఏమిటి నీ దౌర్జన్యం
చరవాణి వచ్చాక
చదువులు శూన్యం
నా ఊసే లేదంటూ
గొల్లుమంటోంది గడియారం
కెమెరా, కాలిక్యులేటర్
వంటి ఎన్నో వస్తువులు
ఉనికి కోల్పోయి
ఉసూరుమంటున్నాయి
బానిసైపోయింది భావితరం
వదలలేమంటోందియువతరం
ఓ సెల్ ఫోన్ ఏముంది నీలో
అంతటి మాయ
మునిగిపోతున్నారు
నిముషమైనా వదలక
పనులందు,చదువులందు
వెనకబడిపోతున్నారు
చిన్నా పెద్దా అందరూ
నీతోనే వ్యాపకం
నేనయ్యాను ఓ జ్ఞాపకం
కథలు చదివే తీరిక లేదు
విషయ పరిజ్ఞానం పట్ల
తెలుసుకోవాలనే ఆసక్తి లేదు
నీ చుట్టూ తిరుగుతోంది
ప్రపంచమంతా
ఏమిటో ఈ వింత ...
